Mithun Reddy: ఏపీ లిక్కర్ కేసు... ముగ్గురికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు

AP Liquor Case Regular Bail Granted to Three Accused
  • ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి,  బాలాజీ గోవిందప్పలకు రెగ్యులర్ బెయిల్
  • పాస్‌పోర్టులు కోర్టుకు అప్పగించాలని ఆదేశం  
  • మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు
ఏపీలో లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ31గా ఉన్న ధనుంజయ్ రెడ్డి, ఏ32గా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ఏ33గా ఉన్న బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరు రూ. లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. దీంతో పాటు, ముగ్గురి పాస్‌పోర్టులను కోర్టుకు అప్పగించాలని షరతు విధించింది.

మరోవైపు, ఇదే కేసులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నెల 11వ తేదీన తిరిగి అధికారుల ఎదుట లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు జులై 20న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రెండుసార్లు రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, కోర్టు వాటిని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీగా తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉందని ఆయన కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌కు అంగీకరించింది.
Mithun Reddy
AP Liquor Scam
Liquor Scam Case
ACB Court
Bail Granted
Dhanunjay Reddy
Krishna Mohan Reddy
Balaji Govindappa
Rajamundry Central Jail
Vice President Election

More Telugu News