హైదరాబాద్ వాసులకు అలర్ట్: 48 గంటల పాటు నీటి సరఫరా బంద్!

  • హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం
  • సెప్టెంబర్ 9 ఉదయం 6 నుంచి 11వ తేదీ ఉదయం 6 వరకు బంద్
  • గోదావరి పంపింగ్ స్టేషన్లలో మరమ్మతు పనులే కారణం
  • మల్లారం, ముర్ముర్, కొండపాక వద్ద పంపింగ్ మెయిన్ షట్‌డౌన్
  • నీటిని నిల్వ చేసుకోవాలని ప్రజలకు జలమండలి సూచన
హైదరాబాద్ నగర ప్రజలకు జలమండలి (HMWS&SB) ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. నగరంలోని పలు ప్రాంతాలకు 48 గంటల పాటు మంచినీటి సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని వెల్లడించారు.

గోదావరి జలాలను నగరానికి తరలించే కీలకమైన మల్లారం, ముర్ముర్, కొండపాక పంపింగ్ స్టేషన్ల పరిధిలో మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఈ పనుల నిమిత్తం అక్కడి పంపింగ్ మెయిన్‌ను మూసివేయాల్సి వస్తోంది. దీని కారణంగానే నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు వివరించారు.

నగరంలోని ఎస్సార్ నగర్, సనత్ నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారా హిల్స్, వెంగళరావు నగర్, సనత్ నగర్, యెల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్ సెక్షన్, జుబ్లీహిల్స్‌లోని కొన్ని ప్రాంతాలు, తట్టిఖానాలోని కొన్ని ప్రాంతాలు, లాలాపేటలోని కొన్ని ప్రాంతాలు, తార్నాకలోని కొన్ని ప్రాంతాలు, కూకట్‌పల్లి, భాగ్యనగర్, వివేకానంద నగర్, ఎల్లమ్మబండ, మూసాపేట్, భరత్ నగర్, మోతీనగర్, గాయత్రి నగర్, బాబా నగర్, కెపీహెచ్‌బీ, బాలాజీ నగర్, హస్మత్‌పేట సెక్షన్‌, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజులరామారం, సూరారం, అల్వాల్, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్‌లోని కొన్ని ప్రాంతాలు, నిజాంపేట, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి అధికారులు తెలిపారు.


More Telugu News