Pratap Sarnaik: మన దేశంలో తొలి కారును డెలివరీ చేసిన టెస్లా.. కొన్నదెవరంటే..!

Tesla Delivers First Car in India to Pratap Sarnaik
––
ప్రపంచ ప్రఖ్యాతి పొందిన టెస్లా కంపెనీ ఇటీవల భారత్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ముంబైలో తొలి షోరూం తెరిచిన టెస్లా.. మొదటి కారును డెలివరీ చేసింది. దేశంలోనే మొట్టమొదటి టెస్లా కారును మహారాష్ట్ర రవాణాశాఖ మంత్రి ప్రతాప్ సర్ నాయక్ కొనుగోలు చేశారు. ముంబైలోని ‘టెస్లా ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌’లో ఆయన తెలుపు రంగు టెస్లా ‘మోడల్‌ వై’ కారు తాళాలను అందుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి ప్రతాప్ మాట్లాడుతూ.. దేశంలో మొదటి టెస్లా కారును అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్యుత్‌ వాహనాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తాను ఈ కారును కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. కాగా, షాంఘై (చైనా) లోని తమ ప్లాంటులో తయారైన కార్లను టెస్లా దిగుమతి చేసుకుని భారతదేశంలో విక్రయిస్తోంది.
Pratap Sarnaik
Tesla
Tesla Model Y
Electric Vehicles India
Mumbai Tesla Showroom
Maharashtra Transport Minister
Tesla India
EV Awareness
Car Delivery India

More Telugu News