Anantapur: హుండీ కొల్లగొట్టి చోరీ.. నెల తర్వాత గుడిలో చోరీ చేసిన సొమ్మును వదిలి వెళ్లిన దొంగలు

Anantapur Thieves Return Stolen Temple Money After a Month
––
ఆలయంలో చొరబడ్డ దొంగలు హుండీ కొల్లగొట్టారు.. సొమ్ము ఎత్తుకెళ్లిన నెల రోజుల తర్వాత దొంగిలించిన సొత్తును తిరిగి ఆలయంలో వదిలి వెళ్లారు. అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రంలో చోటుచేసుకుందీ ఆసక్తికర సంఘటన. 

వివరాల్లోకి వెళితే.. నెల రోజుల క్రితం బుక్కరాయసముద్రం చెరువుకట్టపై ఉన్న ముసలమ్మ ఆలయంలో చోరీ జరిగింది. రాత్రిపూట ఆలయంలోకి చొరబడ్డ దొంగలు హుండీ పగలకొట్టి సొమ్ము ఎత్తుకెళ్లారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా గురువారం ఉదయం గుడి తలుపులు తెరిచిన పూజారులకు గర్భగుడికి ఎదురుగా ఓ మూట కనిపించింది.

పూజారుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మూట విప్పి చూడగా.. అందులో నగదుతో పాటు ఓ లేఖ కనిపించింది. హుండీలో నగదు దొంగిలించడంతో తమ పిల్లలు అనారోగ్యం బారిన పడ్డారని దొంగలు లేఖలో పేర్కొన్నారు. ఆ నగదును లెక్కించగా.. రూ.1,86,486 ఉన్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అమ్మవారి మహత్య్మం వల్లే చోరీ సొత్తు తిరిగి వచ్చిందని పేర్కొన్నారు.
Anantapur
Anantapur district
Andhra Pradesh
Temple theft
Hundi theft
Bukkrayasamudram
Money returned
Theft case
Police investigation
Musalamma Temple

More Telugu News