Upasana Kamineni: వ్రతం ముగిసింది... కోరుకున్న దానికంటే బాబా ఎక్కువ ఇచ్చారు: ఉపాసన

Upasana Kamineni Completes 9 Week Sai Vratham
  • తొమ్మది వారాల సాయిబాబా వ్రతం పూర్తి చేసుకున్న ఉపాసన
  • నర్సు లతా సిస్టర్ తో కలిసి వ్రతం చేసినట్టు వెల్లడి
  • మరింత ఎక్కువ మందికి సేవ చేసే శక్తిని ఇవ్వాలని బాబాను కోరుకుంటున్నానన్న ఉపాసన
స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల తన ఆధ్యాత్మిక చింతనను మరోసారి చాటుకున్నారు. తొమ్మిది వారాల సాయిబాబా వ్రతాన్ని చేపడుతున్నట్టు గురు పౌర్ణమి నాడు ఉపాసన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వ్రతం విజయవంతంగా పూర్తి చేశానని ఆమె తాజాగా వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు.

నర్సు అయిన లతా సిస్టర్‌తో కలిసి ఈ వ్రతాన్ని మొదలుపెట్టినట్లు ఉపాసన గతంలోనే తెలిపారు. తాజాగా ఈ వ్రతం ముగిసిన సందర్భంగా ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. "గురు పౌర్ణమి రోజున నేను ప్రారంభించిన తొమ్మిది వారాల సాయి వ్రతం.. శాంతి, స్వస్థత, విశ్వాసంతో కూడిన ప్రయాణంగా ముగిసింది. నేను కోరుకున్న దానికంటే ఎక్కువ ఆశీర్వాదాలు అందించిన బాబాకు ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

అంతేకాకుండా, బాబా కృపతో తన జీవితంలో మరింత ఎక్కువ మందికి సేవ చేసే శక్తినివ్వాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తమకు నిత్యం రక్షణగా ఉంటున్నందుకు సాయిబాబాకు ధన్యవాదాలు చెప్పారు. వ్రతం పూర్తయిన సందర్భంగా ‘అత్తమ్మాస్ కిచెన్’ తరపున అన్నదానం చేస్తున్నట్లు ఉపాసన ప్రకటించారు. వృత్తిపరంగా ఉపాసన ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సమయం కేటాయించడం పట్ల నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. 
Upasana Kamineni
Ram Charan
Upasana Sai Baba Vratham
Sai Baba
Guru Purnima
Latha Sister
духовность
Annadanam
Attammas Kitchen
Hyderabad

More Telugu News