Kavitha: కవితపై తెలంగాణ జాగృతి నేత రాజారాం యాదవ్ తీవ్ర ఆగ్రహం

Kavitha Remarks Draw Ire from Telangana Jagruthi Leader Raja Ram Yadav
  • మీరు చేసే పనులు చంద్రబాబు, రేవంత్ రెడ్డికి ఉపయోగపడుతున్నాయని వ్యాఖ్య
  • తెలంగాణను వ్యతిరేకించే శక్తులకు ఊతమిస్తున్నారని ఆగ్రహం
  • రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తున్నారని విమర్శ
  • కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు తెలంగాణ కోసమే పనిచేస్తారన్న జాగృతి నేత ప్రశాంత్
తెలంగాణ జాగృతి నాయకుడు రాజారాం యాదవ్ సంస్థ అధ్యక్షురాలు కవితపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు.

ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ అస్తిత్వాన్ని వ్యతిరేకించే శక్తులకు ఆమె వ్యాఖ్యలు మద్దతుగా నిలుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలలుగా ఆమె ప్రలోభాలకు గురై మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోందని, ఆ పరిస్థితి నుంచి బయటకు రావాలని సూచించారు.

ఆమె మాట్లాడుతున్న మాటలను ఏ టీవీ ఛానల్స్, ఏ పత్రికలు చూపిస్తున్నాయో తెలుసుకోవాలని అన్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారికి ఆమె వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయని కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమకు తెలంగాణ, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు నాయకత్వం ముఖ్యమని స్పష్టం చేశారు.

తెలంగాణ ద్రోహులకు ఆయుధమిస్తున్నాయి: జాగృతి నేత ప్రశాంత్

కవిత చేసిన వ్యాఖ్యలపై ఆ సంస్థకు చెందిన మరో నేత ప్రశాంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కవిత మాట్లాడుతున్న మాటలు తెలంగాణ ద్రోహులకు ఊతమిచ్చేలా ఉన్నాయని, ఈ విషయాన్ని ఆమె ఆలోచించుకోవాలని హితవు పలికారు. కేసీఆర్‌పై విమర్శలు చేసేవారికి ఆమె వ్యాఖ్యలు ఆయుధంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు నిరంతరం తెలంగాణ అభివృద్ధి కోసం తపనతో పని చేస్తారని అన్నారు.
Kavitha
Kalvakuntla Kavitha
Telangana Jagruthi
Raja Ram Yadav
Revanth Reddy
Chandrababu Naidu
Narendra Modi

More Telugu News