Delhi Traffic: ట్రాఫిక్ తో విసిగిపోయి బైక్ ను తలపై మోసుకుంటూ వెళ్లిన యువకుడు.. వీడియో ఇదిగో!

Delhi Traffic Frustration Man Carries Bike on Head in Viral Video
––
దేశ రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కల కురుస్తున్న భారీ వర్షాలకు వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇటీవల గురుగ్రామ్ లో రెండు గంటల పాటు వర్షం దంచికొట్టగా జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి దాదాపు 7 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఆరేడు గంటలు పట్టిందని వాహనదారులు వాపోయారు.

ఈ క్రమంలో ఓ ద్విచక్రవాహనదారుడు చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ట్రాఫిక్ లో ఇరుక్కుని గంటల తరబడి వేచి ఉన్న యువకుడు విసిగిపోయి తన బైక్ ను నెత్తిపై మోసుకుంటూ వెళ్లాడు. తోడుగా మరో యువకుడు నడుస్తుండగా.. బైక్ ను మోసుకుంటూ వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Delhi Traffic
Delhi Rains
Gurugram Traffic
Traffic Jam
Viral Video
Bike on Head
Heavy Rains
Road Congestion
India Traffic
Delhi Flooding

More Telugu News