మోదీకి ట్రంప్ ముచ్చట్లు చెప్పిన పుతిన్.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు!
- మోదీతో కారు ప్రయాణంపై స్పందించిన పుతిన్
- అందులో పెద్ద రహస్యమేమీ లేదన్న రష్యా అధ్యక్షుడు
- ట్రంప్‌తో జరిగిన చర్చల గురించి మోదీకి వివరించానన్న పుతిన్
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే కారులో ప్రయాణిస్తూ మాట్లాడుకున్న విషయం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ ఏకాంత భేటీలో వారిద్దరూ ఏం చర్చించుకున్నారనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు పుతిన్ తాజాగా తెరదించారు. ఆ సంభాషణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావన వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
చైనా పర్యటన ముగించుకున్న అనంతరం పుతిన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విలేకరి, మోదీతో కారులో జరిగిన సంభాషణ గురించి ప్రశ్నించగా, "అందులో దాచిపెట్టాల్సిన రహస్యమేమీ లేదు. అలాస్కాలో డొనాల్డ్ ట్రంప్‌తో నాకు జరిగిన చర్చల గురించి ప్రధాని మోదీకి వివరించాను" అని పుతిన్ స్పష్టం చేశారు.
ఇటీవల ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే అంశంపై పుతిన్, ట్రంప్ అలాస్కాలో సమావేశమయ్యారు. ఆ భేటీ వివరాలను కూడా పుతిన్ పంచుకున్నారు. ట్రంప్‌తో తన సంభాషణ కేవలం 30 సెకన్ల పాటు 'బ్రోకెన్ ఇంగ్లీష్'లోనే జరిగిందని తెలిపారు. "ట్రంప్‌ను ఆరోగ్యంగా చూసినందుకు సంతోషంగా ఉందని ఆయనతో చెప్పాను" అని పుతిన్ పేర్కొన్నారు.
ఎస్‌సీవో సదస్సు సందర్భంగా పుతిన్ తన కాన్వాయ్‌తో వచ్చి, మోదీ కోసం దాదాపు పది నిమిషాలు వేచి చూశారు. అనంతరం మోదీని తన కారులోనే సదస్సు ప్రాంగణానికి తీసుకెళ్లారు. దాదాపు 45 నిమిషాల పాటు ఇరువురు నేతలు ఏకాంతంగా మాట్లాడుకున్నారని క్రెమ్లిన్ వర్గాలు అప్పట్లో తెలిపాయి. ఈ ప్రయాణం తర్వాత మోదీ కూడా 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ, పుతిన్‌తో చర్చలు ఎప్పటిలాగే అద్భుతంగా సాగాయని పేర్కొన్నారు. అమెరికా సుంకాల ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో ఈ భేటీ జరగడం గమనార్హం.