Indian Celebrities Twitter: ఆగస్టులో నెట్టింట హవా.. మోదీ, ఎన్టీఆర్ గురించే అధిక చర్చ!

Jr NTR Follows Narendra Modi as Most Discussed Indian on X in August
  • ఆగస్టు నెలలో దేశంలో ట్రెండ్ అయిన ప్రముఖుల జాబితా విడుదల
  • అగ్రస్థానంలో నిలిచిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
  • రెండో స్థానాన్ని కైవసం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్
  • లిస్టులో పవన్, మహేశ్ ‌లతో పాటు మొత్తం ఐదుగురు సౌత్ స్టార్లు
  • జాబితాలో ఒక్క బాలీవుడ్ హీరోకు కూడా ద‌క్క‌ని చోటు
సోషల్ మీడియాలో భారతీయ ప్రముఖుల హవా కొనసాగుతోంది. సామాజిక మాధ్యమ దిగ్గజం 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ఆగస్టు నెలకు గాను భారత్‌లో అత్యధికంగా చర్చల్లో నిలిచిన ప్రముఖుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలవగా, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రెండో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

'ఎక్స్' విడుదల చేసిన టాప్-10 జాబితాలో దక్షిణాది తారల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది. మోదీ, ఎన్టీఆర్ తర్వాత తమిళ నటుడు విజయ్ మూడో స్థానంలో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాలుగో స్థానంలో ఉన్నారు. భారత క్రికెటర్ శుభ్‌మ‌న్ గిల్ ఐదో స్థానంలో నిలిచాడు.

తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (6), క్రికెటర్ విరాట్ కోహ్లీ (7), సూపర్ స్టార్ మహేశ్‌ బాబు (8), మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ (9) ఉన్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పదో స్థానంలో నిలిచారు. ఈ లిస్టులో ఐదుగురు సినిమా తారలు ఉండగా, వారంతా దక్షిణాది పరిశ్రమకు చెందినవారే కావడం గమనార్హం. ముగ్గురు టాలీవుడ్, ఇద్దరు కోలీవుడ్ హీరోలు చోటు దక్కించుకోగా, ఒక్క బాలీవుడ్ నటుడికి కూడా స్థానం లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఆగస్టు నెలలో ఎన్టీఆర్ నటించిన 'వార్ 2' విడుదల కావడం, ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న 'డ్రాగన్' సినిమాపై నిరంతర చర్చలు జరగడం ఆయన ట్రెండింగ్‌కు కారణమని భావిస్తున్నారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయ కార్యకలాపాలు, ఆయన నటిస్తున్న 'ఓజీ' సినిమా అప్‌డేట్‌లు నెట్టింట ఆయన్ను వార్తల్లో నిలిపాయి. ఆగస్టు 9న మహేశ్‌ బాబు పుట్టినరోజు వేడుకలు, రాజమౌళితో చేస్తున్న సినిమా విశేషాలు కూడా ఆయన పేరును ట్రెండింగ్‌లోకి తెచ్చాయి. విజయ్ రాజకీయ ప్రవేశం, రజనీకాంత్ 'కూలీ' సినిమా విడుదల వంటి అంశాలు వారిని జాబితాలో నిలిపాయి.
Indian Celebrities Twitter
PM Modi
Junior NTR
Narendra Modi Twitter
Jr NTR War 2
Pawan Kalyan
Mahesh Babu
Social Media Trends India
Telugu Cinema
Kollywood

More Telugu News