Luxury Ship: జలప్రవేశం చేసిన కాసేపటికే నీట మునిగిన లగ్జరీ షిప్.. వీడియో ఇదిగో!

Luxury Ship Sinks Moments After Launch in Turkey
––
ఖరీదైన లగ్జరీ షిప్ ను ఇలా జలప్రవేశం చేశారో లేదో అలా మునిగిపోయింది. నౌక ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులు తీవ్ర భయాందోళనకు గురై సముద్రంలోకి దూకేశారు. అదృష్టవశాత్తూ వారందరినీ రెస్క్యూ సిబ్బంది కాపాడి ఒడ్డుకు చేర్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర తుర్కియేలో మెడ్‌ యిల్మాజ్‌ షిప్‌యార్డ్‌ లో ఓ లగ్జరీ షిప్ ను నిర్మించారు. ఇందుకోసం 1 మిలియన్ డాలర్లు (అక్షరాలా 8.74 కోట్ల రూపాయలకు పైనే) వెచ్చించారు.

షిప్ ను ముస్తాబు చేసి జోంగుల్డాక్‌ తీరంలో జలప్రవేశం చేయించారు. ఈ షిప్ ను కొనుగోలు చేసిన వ్యక్తి తన బంధుమిత్రులను పిలిచి సంతోషంగా సముద్రంలో విహరించాలని యోచించాడు. అనుకున్న ప్రకారంగానే షిప్ ను సముద్రంలోకి చేర్చారు. అయితే, ప్రయాణం మొదలైన కాసేపటికే ఆ షిప్ నీళ్లలో మునిగడం మొదలుపెట్టింది. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు, సిబ్బంది లైఫ్ జాకెట్లు ధరించి సముద్రంలోకి దూకేశారు. వెంటనే స్పందించిన రెస్క్యూ సిబ్బంది వారందరినీ రక్షించారు. కాగా, షిప్ మునిగిపోవడానికి గల కారణాలేంటనే వివరాలపై నిర్మాణ సంస్థ విచారణ చేపట్టింది.
Luxury Ship
Turkey
Ship sinking
Zonguldak
Med Yilmaz Shipyard
Ship launch
Ship accident
Rescue operation

More Telugu News