అమరత్వం, 150 ఏళ్లు బతకడంపై పుతిన్, జిన్‌పింగ్ మధ్య సంభాషణ
- సైనిక పరేడ్ చూడటానికి వెళుతున్న సమయంలో ఆసక్తికర సంభాషణ
- బయోటెక్నాలజీ ద్వారా యవ్వనంగా ఉండొచ్చన్న పుతిన్
- 150 ఏళ్లు బతకడం సాధ్యమేనన్న జిన్‌పింగ్
ప్రపంచ రాజకీయాల్లో ఇద్దరు బలమైన నేతలుగా ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య ఓ ఆసక్తికరమైన సంభాషణ చోటుచేసుకుంది. మనిషి ఆయుష్షు, అమరత్వం వంటి అంశాలపై వారిద్దరూ మాట్లాడుకోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ సంభాషణ చైనా అధికారిక మీడియాతో పాటు పలు అంతర్జాతీయ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కావడంతో వైరల్‌గా మారింది.
చైనా రాజధాని బీజింగ్‌లోని తియానన్మెన్ స్క్వేర్‌లో నిన్న జరిగిన సైనిక పరేడ్‌ను చూడటానికి వెళుతున్న సమయంలో ఈ ఇద్దరు నేతల మధ్య ఈ మాటామంతీ నడిచింది. ఈ సంభాషణలో పుతిన్ మాట్లాడుతూ, బయోటెక్నాలజీ అభివృద్ధి వల్ల అవయవ మార్పిడులు సర్వసాధారణమవుతాయని, దాని ద్వారా యవ్వనంగా ఉంటూ అమరత్వం సాధించవచ్చని వ్యాఖ్యానించారు. దీనికి జిన్‌పింగ్ స్పందిస్తూ, ఈ శతాబ్దంలో మానవులు 150 ఏళ్ల వరకు జీవించగలరనే అంచనాలు ఉన్నాయని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సమయంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వారిని చూసి నవ్వుతూ కనిపించినప్పటికీ, వారి సంభాషణలో పాలుపంచుకున్నారా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు.
రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా ఈ భారీ ఆయుధ ప్రదర్శనను నిర్వహించింది. దాదాపు 50 వేల మంది సందర్శకుల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో హైపర్‌సోనిక్ క్షిపణులు, అత్యాధునిక డ్రోన్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ, ప్రపంచానికి యుద్ధం కావాలో, శాంతి కావాలో తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమానికి ముందు జరిగిన షాంఘై సహకార సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 20 దేశాల అధినేతలు పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా పుతిన్, జిన్‌పింగ్ ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా 20 ఒప్పందాలపై సంతకాలు చేశారు. కృత్రిమ మేధ (AI), గ్యాస్ పైప్‌లైన్ సహా పలు రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించారు.