అక్కడ స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే జగన్ గెలిచే ప్రసక్తే ఉండదు: మంత్రి నారా లోకేశ్
- టీడీపీ కార్యకర్తల సమావేశంలో నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
- తొలిసారిగా జగన్ ఇలాకాలో పాగా వేసిన టీడీపీ
- జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం
అయితే పులివెందులలో ఎన్నికలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే, అందరూ కష్టపడితే జగన్ గెలిచే ప్రసక్తి ఉండదని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బుగ్గలేటిపల్లి వద్ద కమలాపురం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో లోకేశ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.