రుషికొండ ప్యాలెస్ ను మానసిక వైద్యశాలగా మార్చాలి: అశోక్ గజపతిరాజు ఆసక్తికకర సూచన
- క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు
- రుషికొండ ప్యాలెస్ పెచ్చులు ఊడిపోతున్నాయని వార్తలు వినబడుతున్నాయన్న అశోక్ గజపతిరాజు
- రుషికొండ ప్యాలెస్ పూర్తిగా ప్రజాధనంతో నిర్మించారన్న అశోక్ గజపతిరాజు
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌పై గోవా గవర్నర్ పి. అశోక్ గజపతి రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనంతో నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ను మానసిక ఆరోగ్య కేంద్రంగా (పిచ్చి ఆసుపత్రి) మార్చాలని ఆయన ఎద్దేవా చేశారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిన్న విశాఖలో జరిగిన సన్మాన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రుషికొండ ప్యాలెస్ పెచ్చులు ఊడిపోతున్నాయన్న వార్తలు వస్తున్నాయని ఆయన అన్నారు. అది పూర్తిగా ప్రజాధనంతో నిర్మించిన భవనమని పేర్కొన్నారు. దానిని ఎటువంటి ప్రయోజనం లేకుండా వదిలేస్తే ఎలా అని ప్రశ్నించారు. దానిని మానసిక వైద్యశాఖకు కేటాయిస్తే, కనీసం దానిని నిర్మించిన దుర్మార్గులకు ఆ సముద్రపు గాలి అయినా తగులుతుందని వ్యాఖ్యానించారు.
అదే రూ.600 కోట్లు ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తయ్యేదని అన్నారు. ప్రజాధనాన్ని ప్రజల హితానికి వినియోగించాలని సూచించారు. తాను చాలా ఏళ్లు ప్రభుత్వంలో మంత్రిగా పని చేశానని, అప్పుడు సంక్షేమం కోసం అప్పులు చేసేవారని గుర్తు చేశారు. కానీ గత వైకాపా ప్రభుత్వంలో అన్ని తాకట్టు పెట్టడం చూశానని విమర్శించారు.