తెలంగాణలో టీడీపీ లేకుండా పోయిందని రేవంత్ రెడ్డే ఎక్కువ బాధపడుతున్నారు: బీఆర్ఎస్ మాజీ మంత్రి

  • హరీశ్ రావును లక్ష్యంగా చేసుకోవడంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆవేదన
  • కేసీఆర్‌కు హరీశ్ రావు అత్యంత విధేయుడని, సిద్దయ్య లాంటి వారని వ్యాఖ్య
  • టీడీపీ ఉనికిపై రేవంత్ రెడ్డి ఆందోళనను ప్రశ్నించిన నిరంజన్ రెడ్డి
  • ఈటల రాజేందర్ పార్టీ వీడటంలో హరీశ్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టీకరణ
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా పోయిందని చంద్రబాబు కంటే రేవంత్ రెడ్డినే ఎక్కువగా బాధపడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఏ పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు పోరాడారో, ఇప్పుడు అదే పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి టీడీపీ కోసం ఎందుకు ఆరాటపడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

నిరంజన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హరీశ్ రావును లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

ప్రజాభిమానం పొందడంలో, ప్రజల కోసం పనిచేయడంలో హరీశ్ రావును చూసి నేర్చుకోవాలని, అందుకే వయసులో తమ్ముడైనా దక్షతలో తనకంటే అన్నలాంటివాడని చాలాసార్లు చెప్పానని గుర్తు చేశారు.

ఈటల రాజేందర్ పార్టీని వీడటంలో హరీశ్ రావు పాత్ర ఉందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. "నిజానికి ఈటలను బీఆర్ఎస్‌లోకి తీసుకురావడానికి కారణం నేనే. ఆయన పార్టీ నుంచి వెళ్లిపోవడంలో హరీశ్‌కు ఎలాంటి సంబంధం లేదు" అని ఆయన స్పష్టం చేశారు. 


More Telugu News