Meenakshi Chaudhary: అంత పెద్ద హిట్ తరువాత ఇంత స్లోనా?

Meenakshi Chaudhary Special
  • పెద్ద హిట్ గా నిలిచిన 'సంక్రాంతికి వస్తున్నాం'
  • మీనాక్షి కెరియర్ ఊపందుకుంటుందనే టాక్ 
  • ఆమె వైపు నుంచి కనిపించని సందడి 
  • చేతిలో ఉన్న సినిమా 'అనగనగా ఒక రాజు' 
  • వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్

సాధారణంగా హీరోలు ఏదో ఒక భాషవరకే పరిమితమవుతూ ఉంటారు. కానీ హీరోయిన్స్ ఇతర భాషలలోను సందడి చేస్తూ ఉంటారు. ప్రతి ప్రాంతం వారు కూడా హీరోయిన్స్ ను తమ భాషకి చెందినవారిగానే భావిస్తుంటారు. అది వాళ్లకి మాత్రమే సాధ్యమైన విషయం. అందువలన ఏ భాష నుంచి హిట్ పడినా వాళ్లకి ఇతర భాషలలోను క్రేజ్ .. మార్కెట్ పెరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక హిట్ కోసమే వాళ్లు వెయిట్ చేస్తూ ఉంటారు.ఒక సినిమా హిట్ తో హీరోయిన్స్ కి వరుస అవకాశాలు వచ్చి పడుతూ ఉంటాయి. అందువలన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా సూపర్ హిట్ కాగానే, మీనాక్షి చౌదరి దశ తిరిగిందని అంతా అనుకున్నారు. ఇక వరుస సినిమాలతో దూసుకుపోతుందని భావించారు. ఆ సినిమాలో ఆమె చాలా గ్లామరస్ గా కనిపించింది. నటన పరంగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. అందువలన ఆమెను గురించి అంతా అలా అనుకున్నారు. కానీ ఆమె కెరియర్ విషయంలో అలాంటి అద్భుతాలేం జరగలేదు.మీనాక్షి చౌదరి కొత్త ప్రాజెక్టులేమైనా లైన్లో పెడుతుందేమో తెలియదు గానీ, ఆల్రెడీ ఆమె ఒప్పుకున్న సినిమాలు ఇవేనంటూ ఎక్కడా ఎలాంటి సమాచారం కనిపించడం లేదు. ప్రస్తుతం మాత్రం ఆమె చేతిలో ఉన్నది మాత్రం ఒక్కటే సినిమా .. అదే 'అనగనగా ఒక రాజు'. నాగవంశీ - సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి 'మారి' దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.  


Meenakshi Chaudhary
Sankranthi ki Vasthunnam
Anaganaga Oka Raju
Naga Vamsi
Sai Soujanya
Telugu cinema
Tollywood actress
Maari director
Telugu movies 2025
Meenakshi Chaudhary career

More Telugu News