బీఆర్ఎస్ పార్టీకి కవిత రాజీనామా చేయడంపై స్పందించిన బండి సంజయ్
- కవిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తే ఏమిటని వ్యాఖ్య
- కాళేశ్వరం అవినీతి నుండి దృష్టి మరల్చేందుకు కవిత అంశం వచ్చిందన్న సంజయ్
- ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్న
బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేయడంపై కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కవిత అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, గొర్రెల పంపిణీ, బర్రెల కొనుగోలు కుంభకోణాలపై సమగ్ర చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం అవినీతిపై ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ నివేదికలు వచ్చిన తరువాత కూడా ప్రభుత్వం కాలయాపన చేసిందని, ఇప్పుడు సీబీఐకి అప్పగిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం, ఫోన్ ట్యాపింగ్ కేసును ఎందుకు అప్పగించడం లేదని ఆయన ప్రశ్నించారు.