Kammattom: అడుగడుగునా సస్పెన్స్ .. ఓటీటీకి మలయాళ థ్రిల్లర్!
- మలయాళంలో రూపొందిన 'కమ్మట్టం'
- ప్రధాన పాత్రలో సుదేవ్ నాయర్
- 6 ఎపిసోడ్స్ గా పలకరించనున్న సిరీస్
- జీ 5 చేతికి ఓటీటీ హక్కులు
- ఈ నెల 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్
ప్రతివారం ఓటీటీ ప్రేక్షకులు మలయాళం నుంచి థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ ఏమైనా వచ్చిందా అనే ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే మలయాళం దర్శకులు ఈ తరహా కథలను చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తారు. క్రైమ్ జరిగిన తీరు .. ఇన్వెస్టిగేషన్ జరిగే విధానం .. నేరస్థులు తప్పించేకునే పద్ధతి ఇవన్నీ కూడా ప్రేక్షకులను అలా కూర్చోబెట్టేస్తాయి. అందువలన ఈ తరహా కంటెంట్ కోసం ఆత్రుతగా ఉంటారు.
అలాంటి ప్రేక్షకుల కోసం ఈ వారం ఒక మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. 'కమ్మట్టం' అనే టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ పలకరించనుంది. షాన్ తులసీ ధరన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను, ఈ నెల 5వ తేదీ నుంచి జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. 6 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కేరళ పరిసర ప్రాంతాలలో ఈ కథ నడుస్తుంది. సుదేవ్ నాయర్ .. జియో బేబీ ప్రధానమైన పాత్రలను పోషించారు.
శామ్యూల్ ఉమ్మన్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. అందరూ కూడా మిగతా రోడ్డు ప్రమాదాల మాదిరిగానే ఈ సంఘటన కూడా జరిగిందని అనుకుంటారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ ఆఫీసర్ ఆంటోనియా జార్జ్ మాత్రం, ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదనే అనుమానం కలుగుతుంది. ఈ విషయంలో అతను అనుమానించిన ఆటో డ్రైవర్ కూడా హఠాత్తుగా చనిపోతాడు. అప్పుడు జార్జ్ ఏం చేస్తాడు? అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనేది కథ. యథార్థ సంఘటనల ప్రేరణతో రూపొందిన ఈ సిరీస్ ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి.