అల్లు కనకరత్నం నేత్రదానంపై చిరంజీవి స్పందన
- అల్లు కనకరత్నం కళ్లను దానం చేసిన కుటుంబ సభ్యులు
- అవయవదానంలో నేత్రదానం మహా గొప్పదన్న మెగాస్టార్ చిరంజీవి
- కనకరత్నం నేత్ర దానం ఎంతోమందికి స్పూర్తిదాయంగా నిలుస్తుందన్న చిరంజీవి
వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ అల్లు కనకరత్నం నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె బతికి ఉన్న సమయంలోనే చిరంజీవి చేపట్టిన బ్లడ్, ఐ డొనేషన్ వంటి కార్యక్రమాలకు ప్రభావితమై, తాను మరణించిన తర్వాత తన కళ్లను దానం చేయాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆ కోరిక మేరకు ఆమె మరణించిన తర్వాత కళ్లను అల్లు కుటుంబం దానం చేసింది.