తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 50 లక్షల విరాళం ప్రకటించిన బాలకృష్ణ

  • కామారెడ్డి సహా తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు
  • బాధితుల సహాయార్థం విరాళం ప్రకటించిన బాలకృష్ణ
  • ఉడుతాభక్తి సాయం చేస్తున్నట్లు వెల్లడి
హిందూపురం శాసనసభ్యుడు, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మానవత్వం చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డిలో వరద బాధితులను ఆదుకునేందుకు ఆయన ముందుకొచ్చారు.

కామారెడ్డితో పాటు తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. ఇది తన ఉడుతాభక్తి సహాయంగా ఆయన పేర్కొన్నారు.

భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. వాగులు, వంకలు ఏకమై, చెరువులు నిండి పట్టణాలు, గ్రామాలపైకి వరద పోటెత్తింది.


More Telugu News