అత్తగారి పాడె మోసిన చిరంజీవి... వీడియో ఇదిగో!
- అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ కన్నుమూత
- పాడె మోసిన చిరంజీవి, అల్లు అర్జున్
- కోకాపేటలో జరుగుతున్న అంత్యక్రియలు
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి, దివంగత నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (94) ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, తన నివాసంలోనే కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు కోకాపేటలోని ఫామ్‌హౌస్‌లో జరుగనున్నాయి.
ఈ సందర్భంగా ఓ భావోద్వేగ దృశ్యం అందరినీ కదిలించింది. మెగాస్టార్ చిరంజీవి తన అత్తమ్మ కనకరత్నమ్మ పాడెను భుజాలపై మోశారు. అల్లు అర్జున్ తో కలిసి ఆయన కనకరత్నమ్మ పాడెను మోశారు. రామ్ చరణ్ కూడా అక్కడే ఉండి, అంత్యక్రియల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉదయమే అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్న చిరంజీవి, రామ్ చరణ్ అల్లు కుటుంబ సభ్యులను ఓదార్చారు.