అందుకే సావిత్రి అందరికీ గుర్తుంది: తనికెళ్ల భరణి!

  • రచయితగా నటుడిగా మంచి గుర్తింపు
  • అది సావిత్రి సహజ లక్షణమన్న భరణి 
  • ఆమెను మోసం చేసినవారు చెడ్డవారని వ్యాఖ్య 
  • కాలం చాలా మారిపోయిందని వెల్లడి     

రచయితగా .. నటుడిగా తనికెళ్ల భరణికి మంచి పేరు ఉంది. దర్శకుడిగా కూడా తన మార్క్ చూపించిన వారాయన. అలాంటి భరణి తాజాగా 'ఇస్మార్ట్ శివ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "ఎస్వీ రంగారావు .. సావిత్రి .. సూర్యకాంతం .. వంటి మహామహులు నాటకాల నుంచే ఇండస్ట్రీకి వచ్చారు. అలాంటి నాటకాల నుంచే నేను రావడం నా అదృష్టంగా భావిస్తూ ఉంటాను" అని ఆయన అన్నారు. 

"సావిత్రి దారు అనవసరంగా దానధర్మాలు చేసి చివరి రోజులలో ఇబ్బంది పడ్డారని చాలామంది చెప్పుకుంటారు. దానం చేయడమనేది సావిత్రి గారికి సహజంగా వచ్చిన లక్షణం .. అది మానేస్తే బాగుండేది అనుకోవడం కరెక్ట్ కాదు. మనిషన్నాక దానధర్మాలు చేయాలి. దానధర్మాలు చేయడం వలన సాయవిత్రి గారేమీ పాడైపోలేదు .. చరిత్రలో మిగిలిపోయారు. నలుగురిలో గుర్తుండిపోయారు. తప్పు ఎవరిదీ అంటే ఆమెను మోసం చేసినవారిది" అని చెప్పారు. 

"చిత్తూరు నాగయ్య కూడా ఎన్నో దానధర్మాలు చేశారు. తెరపై వాళ్లు గొప్ప గొప్ప పాత్రలు చేయడమే కాదు, బయట కూడా వాళ్లు ఉన్నతమైన తమ వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. వాళ్లెవరూ చనిపోయినట్టు కాదు. టీవీలలో వాళ్ల బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వస్తున్నంత కాలం వాళ్లు బ్రతికి ఉన్నట్టే. ఆ రోజులు వేరు .. ఆ పరిస్థితులు వేరు. అప్పుడు ఆశయాలే తప్ప కోరికలు ఉండేవి కాదు. తల్లిదండ్రులను .. గురువులను .. అతిథులను ప్రేమించిన చివరి జనరేషన్ మాదే అనుకుంటా" అని అన్నారు. 



More Telugu News