ట్రంప్ కు ఏమైంది? అనారోగ్యంతో బాధపడుతున్నాడంటూ ప్రచారం
- బాహ్య ప్రపంచానికి కనిపించని అమెరికా అధ్యక్షుడు
- ట్రూత్ సోషల్ లో పోస్టులు పెట్టడంతో సరిపెడుతున్న ట్రంప్
- వారాంతంలోనూ అధ్యక్షుడి షెడ్యూల్స్ లేకపోవడంపై అనుమానాలు
మరోవైపు, ఇవన్నీ ఊహాగానాలేనని మరికొందరు చెబుతున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ట్రంప్ సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు. సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం నేపథ్యంలో వారాంతంలో బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. ఇక, ట్రంప్ చేతి గాయం నిజమేనని ఆయన వైద్యుడు షాన్ బార్బబెల్లా వెల్లడించారు. అయితే, అదంత తీవ్రమైనది కాదని, ట్రంప్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు.