Gurpreet Singh: కాల్చివేతకు ముందు గట్కా నృత్యం చేసిన సిక్కు యువకుడు.. వీడియో ఇదిగో!

Gurpreet Singh Shot by Police After Gatka Performance in LA
  • లాస్ ఏంజిల్స్‌లో సిక్కు వ్యక్తి కాల్చివేత ఘటన వీడియో విడుదల
  • రహదారిపై కత్తితో 'గట్కా' యుద్ధ విద్య ప్రదర్శించిన గురుప్రీత్ సింగ్
  • ఆయుధం పడేయాలన్న పోలీసుల ఆదేశాలు బేఖాతరు
  • అధికారులపైకి కత్తితో దూసుకెళ్లడంతో కాల్పులు
అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జులై 13న జరిగిన ఓ సిక్కు వ్యక్తి కాల్చివేత ఘటనకు సంబంధించిన కీలక వీడియోను లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తాజాగా విడుదల చేసింది. గురుప్రీత్ సింగ్ (35)పై పోలీసులు జరిపిన కాల్పులకు దారితీసిన పరిస్థితులను ఈ వీడియో స్పష్టంగా చూపిస్తోంది. నగరంలోని అత్యంత రద్దీ కూడలి అయిన ఒలింపిక్ బౌలేవార్డ్, ఫిగెరోవా స్ట్రీట్ కూడలిలో ఓ వ్యక్తి పెద్ద కత్తితో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

విడుదలైన వీడియో ఫుటేజీ ప్రకారం గురుప్రీత్ సింగ్ తన కారును రోడ్డు మధ్యలో ఆపి కత్తితో విన్యాసాలు చేస్తూ కనిపించాడు. అతడు సిక్కుల పురాతన యుద్ధ విద్య అయిన 'గట్కా'ను ప్రదర్శించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో అతడు తన నాలుకను అదే కత్తితో గాయపరచుకోవడం కూడా వీడియోలో రికార్డయింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా, గురుప్రీత్ సింగ్ తన కారుతో ఓ పోలీసు వాహనాన్ని ఢీకొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడిని వెంబడించగా, ఫిగెరోవా, 12వ స్ట్రీట్ మధ్యలో తన వాహనాన్ని ఆపేశాడు. అనంతరం కారు దిగి, చేతిలో కత్తితో పోలీసుల వైపు దూసుకెళ్లాడు. ఆయుధాన్ని కింద పడేయాలని అధికారులు చాలాసార్లు హెచ్చరించినా గురుప్రీత్ సింగ్ వారి మాటలను పెడచెవిన పెట్టాడు. వారిపైకి ఓ వాటర్ బాటిల్ విసిరి, మళ్లీ పారిపోవడానికి యత్నించాడు. దీంతో ఆత్మరక్షణ కోసం అధికారులు అతనిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన గురుప్రీత్‌ విలవిల్లాడుతూ రోడ్డు పక్కన పడిపోవడం వీడియోలో కనిపిస్తోంది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.
Gurpreet Singh
Los Angeles
police shooting
Sikh man
gatka dance
knife incident
Olympic Boulevard
Figueroa Street
police chase

More Telugu News