నడిరోడ్డుపై వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. విశాఖలో కలకలం
––
విశాఖపట్నంలో ఈ రోజు ఉదయం కలకలం రేగింది. నగరంలోని అరిలోవ ప్రాంతంలో ఓ వ్యక్తి నడిరోడ్డుపై ఆత్మహత్యాయత్నం చేశాడు. అందరూ చూస్తుండగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది వేగంగా స్పందించి మంటలు ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుడిని 108 అంబులెన్స్ లో కేజీహెచ్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.