Ramakrishna Rao: తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు సర్వీసు పొడిగింపు

Ramakrishna Rao Service Extended as Telangana Chief Secretary
  • రామకృష్ణారావు సర్వీసును పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి
  • సర్వీసును పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
  • వచ్చే ఏడాది మార్చి వరకు సీఎస్‌గా కొనసాగనున్న రామకృష్ణారావు
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు సర్వీసును పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. పదవీ విరమణ చేయవలసి ఉండగా, ఆయన సర్వీసును పొడిగించాలని డీవోపీటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం మరో ఏడు నెలల పాటు రామకృష్ణారావు సర్వీసును పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనితో 2026 మార్చి వరకు రామకృష్ణారావు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు.
Ramakrishna Rao
Telangana CS
Chief Secretary Telangana
Telangana Government
Service Extension

More Telugu News