ఉప్పొంగుతున్న జంపన్న వాగు.. వీడియో ఇదిగో!
––
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వాగులు పొంగుతున్నాయి. ములుగు జిల్లాలోని మేడారం వద్ద జంపన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెనను ఆనుకొని వరద ప్రవాహం కొనసాగుతోంది.