Ammerpet: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం

Ammerpet Fire Accident at Balaji Ghee Shop in Hyderabad
  • అమీర్ పేటలోని బాలాజీ నెయ్యి దుకాణం నుంచి ఎగసిపడిన మంటలు
  • మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
  • పక్కనే ఉన్న ఎంబ్రాయిడరీ షాపులోకి మంటల వ్యాప్తి 
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెట్రో పిల్లర్ 1444 వద్ద గల బాలాజీ నెయ్యి దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనితో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు.

ప్రమాదం జరిగిన సమయంలో దుకాణంలో ఎంతమంది ఉన్నారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. మంటలు తీవ్రంగా ఎగసిపడటంతో పక్కనే ఉన్న ఎంబ్రాయిడరీ షాపుకు కూడా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆ దుకాణంలోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదానికి గల కారణాలు, నష్టం ఎంత వాటిల్లిందనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 
Ammerpet
Hyderabad fire accident
Ammerpet fire
Balaji ghee shop
Metro pillar 1444
Fire accident
Embroidery shop fire
Hyderabad news

More Telugu News