Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడి వద్ద మొదలైన భక్తుల సందడి.. గవర్నర్ తొలిపూజ
ఖైరతాబాద్ లో కొలువుదీరిన బడా గణేశుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వర్షం కురుస్తున్నప్పటికీ భక్తుల తాకిడి అధికంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరం 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో శ్రీ విశ్వశాంతి మహా గణపతి రూపంలో విగ్రహాన్ని రూపొందించారు. కుడివైపున శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు, ఎడమ వైపున ఖైరతాబాద్ గ్రామ దేవత గజ్జలమ్మ ప్రతిరూపాలను ఏర్పాటు చేశారు.
ఆనవాయితీ ప్రకారం ఖైరతాబాద్ మహా గణపతికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలిపూజ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ లతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక పూజలు చేశారు.