Kalyani Priyadarshan: ఫ్యాంటసీ థ్రిల్లర్ 'కొత్తలోక' చాప్టర్ 1 తెలుగు ట్రైలర్ విడుదల

Kalyani Priyadarshans Kotha Loka Chapter 1 Telugu Trailer Released
  • కల్యాణి ప్రియదర్శన్‌, నస్లేన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ ‘కొత్త లోక’
  • ఆగస్టు 29న థియేటర్లలో విడుదల 
  • తెలుగు ట్రైలర్ ను విడుదల చేసిన చిత్ర బృందం
కల్యాణి ప్రియదర్శన్, నస్లెన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కొత్త లోక’. ఈ చిత్రానికి డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్ ఎపిసోడ్ ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’ పేరుతో ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఇటీవల మలయాళ ట్రైలర్‌ను విడుదల చేయగా, తాజాగా తెలుగు ట్రైలర్‌ను నిన్న విడుదల చేశారు.

ఇందులో కల్యాణి ప్రియదర్శన్ సూపర్ పవర్స్ కలిగిన యువతిగా ‘లోక’ అనే పాత్రలో కనిపించారు. ఓ కొత్త ఊరికి వెళ్లిన ఆమె ఎందుకు తన పద్ధతిని మార్చుకుంది? ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? అనే ప్రశ్నల చుట్టూ సినిమా కథ తిరుగుతున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
విజువల్స్, నేపథ్య సంగీతం, పాత్రల రహస్యత ఈ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫాంటసీ కథల్ని ఇష్టపడే ప్రేక్షకుల్ని ఈ చిత్రం కచ్చితంగా ఆకట్టుకునే అవకాశముంది.

ఇక మలయాళ సినీ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చనీయాంశంగా మారిన ‘కొత్త లోక’ తెలుగులోనూ అదే స్థాయిలో సూపర్‌హిట్ అవుతుందా? అన్నది చూడాల్సిందే. 
Kalyani Priyadarshan
Kotha Loka
Kotha Loka Chapter 1
Naslen
Telugu trailer
Fantasy thriller
Dominic Arun
Malayalam movie
Telugu movie release

More Telugu News