Anushka Shetty: 'ఘాటీ' ప్రమోషన్లకు దూరంగా అనుష్క.. ఆమె వ్యక్తిగత నిర్ణయమన్న నిర్మాత

Producer Confirms Anushka Shettys Absence From Ghaati Promotions
షార్ట్స్‌లో చూడండి
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం 'ఘాటీ'. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు అనుష్క దూరంగా ఉండనున్నారని నిర్మాత రాజీవ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది ఆమె వ్యక్తిగత నిర్ణయమని, తాము దానిని గౌరవిస్తున్నామని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఈ కీలక విషయాలను పంచుకున్నారు.

ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ... "సినిమా ప్రారంభానికి ముందే ప్రమోషన్లకు హాజరు కాలేనని అనుష్క మాకు చెప్పారు. బహుశా ప్రీ-రిలీజ్ వేడుకకు కూడా ఆమె రాకపోవచ్చు. అయినా మాకు ఎలాంటి ఆందోళన లేదు. ఎందుకంటే 'షీలా' పాత్రలో అనుష్క జీవించారు. ఆ పాత్రలో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేం. తన నటనతోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సత్తా ఆమెకు ఉంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ, ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని ఓ మారుమూల గ్రామంలో చిత్రీకరణ జరిపినట్లు ఆయన చెప్పారు. "తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ చేసి ఉంటే అనుష్కను చూడటానికి వచ్చే జనాలను అదుపు చేయడం చాలా కష్టమయ్యేది. ఒడిశాలోని ఓ చిన్న గ్రామంలో తెల్లవారుజామున షూటింగ్ చేస్తున్నా కూడా, ఆమెను చూసేందుకు దాదాపు వెయ్యి మంది వచ్చారు. ఓ సందర్భంలో లాఠీఛార్జి కూడా చేయాల్సి వచ్చింది" అని ఆయన వివరించారు.

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నేపథ్యంలో సాగే ఈ కథలో, అనుష్క, విక్రమ్ ప్రభు గంజాయి స్మగ్లర్లుగా నటించారు. తాము చేస్తున్నది తప్పని తెలుసుకుని, ఆ నేర సామ్రాజ్యాన్ని నడిపించే వ్యవస్థపై వారు ఎలా తిరగబడ్డారన్నదే ఈ చిత్ర కథాంశం. 
Go Back to Shorts
Anushka Shetty
Ghaati movie
Krish Jagarlamudi
Rajeev Reddy producer
Telugu cinema
Vikram Prabhu
Andhra Odisha border
Ganja smuggling
Sheela character
Movie promotions

More Telugu News