ఆ బ‌స్సుల్లోనూ మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం: ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు

  • ఏపీ ఆర్టీసీకి త్వ‌ర‌లోనే రానున్న‌ 1,500 కొత్త ఎల‌క్ట్రిక‌ల్‌ ఏసీ బ‌స్సులు
  • ఈ బ‌స్సులొచ్చాక వాటిలోనూ స్త్రీ శ‌క్తి ప‌థ‌కం అమ‌లు చేస్తామ‌న్న ఆర్టీసీ ఎండీ
  •  స్త్రీ శ‌క్తి కార‌ణంగా పాత రూట్లు ర‌ద్దు చేసే ఆలోచ‌న లేద‌ని వెల్ల‌డి
  • అవ‌స‌ర‌మైతే డిమాండ్‌ను బ‌ట్టి మ‌రిన్ని బ‌స్సులు ఏర్పాటు చేస్తామ‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌
ఏపీ ఆర్టీసీకి త్వ‌ర‌లోనే 1,500 కొత్త ఎల‌క్ట్రిక‌ల్‌ ఏసీ బ‌స్సులు రానున్నాయ‌ని సంస్థ ఎండీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు చెప్పారు. స్త్రీ శ‌క్తి ప‌థ‌కం ద్వారా వాటిలోనూ మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం క‌ల్పిస్తామ‌ని తెలిపారు. నిన్న ఆయ‌న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లి గూడెంలోని ఆర్టీసీ బస్టాండ్‌, డిపోను ప‌రిశీలించారు. 

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. ఈ ప‌థ‌కం అమ‌లు చేస్తున్న పొరుగు రాష్ట్రాల‌తో పోలిస్తే ఇక్క‌డ ఎలాంటి స‌మస్య‌లు ఎదురుకాలేద‌న్నారు. స్త్రీ శ‌క్తి కార‌ణంగా పాత రూట్లు ర‌ద్దు చేసే ఆలోచ‌న లేద‌ని, అవ‌స‌ర‌మైతే డిమాండ్‌ను బ‌ట్టి మ‌రిన్ని బ‌స్సులు ఏర్పాటు చేస్తామ‌ని వెల్ల‌డించారు. పక్క రాష్ట్రాల్లో మ‌హిళ‌లు, పురుష ప్ర‌యాణికుల నిష్ప‌త్తి 63-37గా ఉంటే.. ఏపీలో మాత్రం 70-30గా ఉంద‌న్నారు. 


More Telugu News