అసలు రేవంత్ రెడ్డి ఎవరు?: ప్రశాంత్ కిశోర్ తీవ్ర ఆగ్రహం
- బీహార్ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి జోక్యం ఏమిటన్న ప్రశాంత్ కిశోర్
- రేవంత్ రెడ్డికి బీహార్‌లో ఏం పని అని నిలదీత
- బీహార్‌ను అవమానించాడని ఆగ్రహం
మాజీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ రాజకీయాల్లో రేవంత్ జోక్యం చేసుకోవడాన్ని తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలు సంధించారు. "అసలు రేవంత్ రెడ్డి ఎవరు? బీహార్‌లో ఆయనకు ఏం పని?" అని ప్రశ్నించారు.
బీహార్‌తో రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏమిటని, ఆయన స్థాయి ఏమిటని ప్రశాంత్ కిశోర్ నిలదీశారు. ఒకవైపు బీహార్ ప్రజలను అవమానించేలా మాట్లాడి, మరోవైపు అదే బీహార్‌కు ఓట్లు అడగడానికి ఎలా వస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీహార్‌ను అవమానించే నాయకులను కాంగ్రెస్ కలిగి ఉందని, ఇది రాహుల్ గాంధీ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.