Nara Lokesh: అన్న, వదినకు హ్యాపీ మ్యారేజ్ డే: నారా రోహిత్

Nara Rohit Wishes Nara Lokesh and Brahmani Happy Anniversary
  • నేడు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న నారా లోకేశ్, బ్రాహ్మణి
  • హృదయపూర్వకంగా విషెస్ తెలిపిన నటుడు నారా రోహిత్
  • మీ ప్రయాణం కలకాలం సాగాలంటూ ఆకాంక్ష
  • మీ బంధం ఏటేటా మరింత అందంగా మారాలని పోస్ట్
ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు నేడు తమ పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారికి ప్రముఖ నటుడు నారా రోహిత్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తన సోదరుడు, వదినలకు ప్రేమతో విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో ఒక సందేశాన్ని పంచుకున్నారు.

"ప్రియమైన లోకేశ్ అన్న, బ్రాహ్మణి వదినలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు" అని పేర్కొంటూ రోహిత్ తన పోస్ట్‌ను ప్రారంభించారు.  మీ ఇద్దరి జంట ప్రయాణం అనంతమైన ప్రేమ, శక్తి, ఐక్యతతో నిండి ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. గడిచే ప్రతి ఏడాదీ వారి బంధం మరింత అందంగా, పటిష్ఠంగా మారాలని ఆకాంక్షిస్తున్నాను. దేవుడి ఆశీస్సులు మీ ఇద్దరికీ ఎల్లప్పుడూ ఉండాలి" అంటూ ట్వీట్ చేశారు.

నారా రోహిత్ పోస్ట్ కు సోషల్ మీడియాలో విశేష స్పందన వస్తోంది. 
Nara Lokesh
Nara Brahmani
Nara Rohit
Happy Anniversary
TDP
Andhra Pradesh
Marriage Anniversary
Political News
Tollywood

More Telugu News