Mohammed Khayyum: అత్యాచారం కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి 50 ఏళ్ల జైలు శిక్ష

Mohammed Khayyum gets 50 years jail in Nalgonda rape case
  • దళిత మైనర్ బాలికపై అత్యాచారం కేసు
  • నిందితుడు మహమ్మద్ ఖయ్యుంపై ఫోక్సో కేసు నమోదు
  • 2022 నుంచి జిల్లా కోర్టులో వాదనలు
నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దళిత మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 50 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. జిల్లాలోని తిప్పర్తికి చెందిన మహమ్మద్ ఖయ్యుంపై నమోదైన ఫోక్సో కేసు విచారణ పూర్తి కాగా, జడ్జి రోజా రమణి నిందితుడికి 51 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై 2021లో తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో మహమ్మద్ ఖయ్యుంపై పోక్సో కేసు నమోదైంది. 2022 నుంచి జిల్లా కోర్టులో వాదనలు కొనసాగాయి. అత్యాచార కేసులో 20 ఏళ్లు, పోక్సో కేసులో 20 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ కేసులో పదేళ్లు, సెక్షన్ 506 కేసులో మరో ఏడాది శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించారు. బాలికలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు కఠిన శిక్షలు అవసరమని, ఈ తీర్పు సమాజానికి హెచ్చరికగా నిలవాలని జడ్జి రోజా రమణి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
Mohammed Khayyum
Nalgonda court
POCSO Act
Telangana rape case
Dalit minor girl

More Telugu News