కొత్తగూడెంలో దారుణం.. భార్యను రెండేళ్లు గదిలో బంధించి అస్తిపంజరంలా మార్చి హత్య!
- కొత్తగూడెం జిల్లాలో వివాహిత అనుమానాస్పద మృతి
- మెట్లపై నుంచి పడి చనిపోయిందంటున్న భర్త
- అదనపు కట్నం కోసమే హత్య అని తల్లిదండ్రుల ఆరోపణ
- తిండి పెట్టకుండా, గదిలో బంధించి హింసించారని ఫిర్యాదు
- మృతదేహంపై పాత, కొత్త గాయాలు.. ఎముకలు తేలిన దేహం
- భర్తపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు
తెలంగాణ రాష్ట్రం, కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్యకు ఆహారం పెట్టకుండా ఆమె మరణానికి కారకుడైన ఓ కిరాతక భర్త ఉదంతం వెలుగులోకి వచ్చింది. భార్య మెట్లపై నుంచి జారిపడి మరణించిందని భర్త చెబుతుండగా, ఇది హత్యేనని, అదనపు కట్నం కోసం రెండేళ్లుగా నరకం చూపించి, చివరకి ప్రాణాలు తీశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషాద ఘటన అశ్వారావుపేటలో జరిగింది.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వన్నాథపురానికి చెందిన లక్ష్మీప్రసన్న (33)కు, ఖాన్‌ఖాన్‌పేట గ్రామ వాసి పూల నరేష్ బాబుకు 2015లో వివాహం జరిగింది. గత మూడేళ్లుగా వారు అశ్వారావుపేటలో నివాసం ఉంటున్నారు.
శనివారం, తన భార్య లక్ష్మీప్రసన్న మెట్ల మీద నుంచి కింద పడిపోయిందని, ఆసుపత్రికి తీసుకొచ్చానని నరేష్ బాబు తన అత్తమామలకు ఫోన్ చేసి చెప్పాడు.
ఆసుపత్రికి వెళ్లిన తల్లిదండ్రులు, అక్కడ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆమె శరీరంపై కొత్త గాయాలతో పాటు, పాత గాయాల ఆనవాళ్లు కూడా ఉండటంతో వారికి అనుమానం బలపడింది.
రెండేళ్లుగా తమ కుమార్తెను ఒక గదిలో బంధించి, కనీసం తమతో కూడా మాట్లాడనివ్వలేదని లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు ఆరోపించారు. అదనపు కట్నం కోసమే నరేష్, అతని కుటుంబ సభ్యులు తమ కుమార్తెను ఆహారం పెట్టకుండా హింసించి, చివరకి చంపేశారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.