Kanpur Thief: రోగిలా నటిస్తూ డాక్టర్ ఐఫోన్ ఎత్తుకెళ్లిన దొంగ.. వీడియో ఇదిగో!

Kanpur Thief Arrested for Stealing Doctors iPhone
  • కాన్పూర్ ఆసుపత్రి కారిడార్ లో మాట్లాడుకుంటున్న ఇద్దరు మహిళా వైద్యులు
  • వారి పక్క నుంచి వెళుతూ డాక్టర్ తెల్లకోటులో ఉన్న ఫోన్ మాయం చేసిన దొంగ
  • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గంటలోపలే అరెస్టు చేసిన పోలీసులు
చికిత్స కోసం వచ్చిన రోగిలా నటిస్తూ వైద్యురాలి ఐఫోన్ ఎత్తుకెళ్లాడో దొంగ. వైద్యురాలి ఫిర్యాదుతో వేగంగా స్పందించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. సదరు దొంగను గుర్తించి కేవలం 60 నిమిషాల వ్యవధిలోనే అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 
అసలేం జరిగిందంటే..
యూపీకి చెందిన మహ్మద్ ఫయాజ్ ఇటీవల కాన్పూర్ లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నటించిన ఫయాజ్.. చేతిలో కర్రతో కుంటుకుంటూ నడవడం వీడియోలో కనిపిస్తోంది. వైద్యుడు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ చేతిలో పట్టుకుని అక్కడే కాసేపు ఉన్న ఫయాజ్.. కారిడార్ లో మాట్లాడుకుంటున్న ఇద్దరు మహిళా వైద్యుల పక్క నుంచి బయటకు వెళ్లాడు. వెళుతూ వెళుతూ ఓ వైద్యురాలి తెల్ల కోటులో ఉన్న ఐఫోన్ ను చాకచక్యంగా కాజేశాడు.

ఆపై కుంటుతూనే ఆసుపత్రి బయటకు వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత తన ఫోన్ కనిపించకపోవడంతో వెంటనే అప్రమత్తమైన వైద్యురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆసుపత్రి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి ఫయాజ్ నిర్వాకాన్ని గుర్తించారు. బయటకు వెళ్లిపోయిన ఫయాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టి కేవలం 60 నిమిషాల్లోనే అరెస్టు చేశారు. తాను గతంలోనూ ఇలాగే ఓ ఫోన్ దొంగిలించానని ఫయాజ్ విచారణలో వెల్లడించాడు.
Kanpur Thief
Mohammad Fayaz
Uttar Pradesh Crime
iPhone Theft
Hospital Theft
Kanpur Police
CCTV Footage
Crime News India

More Telugu News