పల్నాడు జిల్లాలో విషాదం .. రైలు కిందపడి ఇద్దరి మృతి
- పిడుగురాళ్ల పరిధి జానపాడు వద్ద ఘటన
- మృతుల్లో ఒకరిని బిక్షగాడిగా గుర్తించిన స్థానికులు
- ఘటనపై విచారణ చేపట్టిన రైల్వే పోలీసులు
పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పిడుగురాళ్ల పరిధిలోని జానపాడు వద్ద రైలు కింద పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతదేహాలు ఛిద్రం కావడంతో గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుల్లో ఒకరు భిక్షాటన చేసుకుంటూ జీవించే వ్యక్తి అని స్థానికులు గుర్తించారు.
మృతుల్లో మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. వీరు ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా, లేక ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.