Chiranjeevi: చిరంజీవి ఉదారత.. ఏపీ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం

Chiranjeevi Donates 1 Crore to AP CM Relief Fund
  • సీఎం చంద్రబాబును నేరుగా కలిసి చెక్కు అందజేత
  • రాష్ట్ర ప్రజల సంక్షేమం, విపత్తుల కోసమే ఈ సాయం అని వెల్లడి
  • చిరంజీవి సామాజిక బాధ్యతను ప్రశంసించిన ముఖ్యమంత్రి
  • సోషల్ మీడియాలో చిరంజీవిపై ప్రశంసల వెల్లువ
మెగాస్టార్ చిరంజీవి తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన మద్దతు తెలుపుతూ, సీఎం సహాయ నిధికి కోటి రూపాయల భారీ విరాళాన్ని అందించారు. సీఎం చంద్రబాబును స్వయంగా కలిసి, ఈ విరాళానికి సంబంధించిన చెక్కును ఆయనకు అందజేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల సంక్షేమం, ప్రకృతి విపత్తులు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. చిరంజీవి అందించిన సాయం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. “చిరంజీవి ఎప్పుడూ సామాజిక బాధ్యతకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రజల కోసం, సేవా కార్యక్రమాల కోసం ఆయన చేసే కృషి ప్రశంసనీయం” అని చంద్రబాబు అన్నారు.

ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెగాస్టార్ సేవాగుణాన్ని అభినందిస్తూ ఆయన అభిమానులు “చిరు రియల్ హీరో” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సేవలతో ఎందరికో అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ విరాళం ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Chiranjeevi
AP CM Relief Fund
Andhra Pradesh
Chandra Babu
Donation
Philanthropy
Manam Shankara Varaprasad Garu
Viswambhara

More Telugu News