Kuneneni Sambasiva Rao: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి సాంబశివరావు

Kuneneni Sambasiva Rao Re elected as CPI State Secretary
  • గాజులరామారంలో జరిగిన మహాసభల్లో ఎన్నుకున్న పార్టీ
  • కూనంనేని సాంబశివరావు పేరును ప్రతిపాదించిన పల్లా వెంకటరెడ్డి
  • బలపరిచిన పార్టీ నాయకుడు శంకర్
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు మరోసారి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని గాజులరామారంలో జరిగిన సీపీఐ 4వ రాష్ట్ర మహాసభల్లో ఆయన పేరును పార్టీ సీనియర్ నేత పల్లా వెంకటరెడ్డి ప్రతిపాదించగా, మరో నాయకుడు శంకర్ బలపరిచారు. దీంతో కూనంనేని వరుసగా రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

కూనంనేని సాంబశివరావు కొత్తగూడెంకు చెందినవారు. పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి, ఈ స్థాయికి ఎదిగారు. విశాలాంధ్ర పత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు. 1984లో కొత్తగూడెం పట్టణం సీపీఐ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2009లో కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Kuneneni Sambasiva Rao
CPI Telangana
CPI State Secretary
Telangana Politics
Kuneneni Sambasiva Rao MLA

More Telugu News