Har Pal Singh: ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కోసం కీలక నియామకం.. ఇరిగేషన్ శాఖకు కొత్త సలహాదారు

Har Pal Singh Appointed as Irrigation Advisor for SLBC Tunnel
  • తెలంగాణ ఇరిగేషన్ శాఖకు కొత్త సలహాదారు నియామకం
  • రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ హర్ పాల్ సింగ్‌కు కీలక బాధ్యతలు
  • రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న హర్ పాల్ సింగ్
  • ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి
  • నియామక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ మార్గం పనులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టును వేగవంతం చేసే లక్ష్యంతో భారత సైన్యానికి చెందిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ హర్ పాల్ సింగ్‌ను నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించింది.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం హర్ పాల్ సింగ్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ముఖ్యంగా ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక సవాళ్లను అధిగమించి, పనులను సకాలంలో పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆయన సేవలను వినియోగించుకోనుంది.
Har Pal Singh
SLBC Tunnel
Srisailam Left Bank Canal
Telangana Irrigation Project
Irrigation Department Advisor

More Telugu News