Shine Tom Chacko: ఓటీటీ తెరపైకి వచ్చేసిన 'సూత్రవాక్యం'

Sootravakyam Movie Update
  • మలయాళ చిత్రంగా 'సూత్రవాక్యం'
  • జులైలో విడుదలైన సినిమా 
  • ఈ రోజు నుంచి 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్
  • కథాకథనాల పరంగా మెప్పించే కంటెంట్  

ఓటీటీ సెంటర్స్ లో ఇప్పుడు మలయాళం కంటెంట్ కి మంచి క్రేజ్ ఉంది. మలయాళం నుంచి వచ్చిన సినిమాలను చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. తెలుగు ఆడియోతో వస్తున్న మలయాళ సినిమాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మలయాళం నుంచి మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా పేరే 'సూత్ర వాక్యం'.

షైన్ టామ్ చాకో ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, జులై 11వ తేదీన థియేటర్లకు వచ్చింది. కొత్త పాయింటును టచ్ చేసిన కంటెంట్ గా ఈ సినిమాను గురించి చెప్పుకున్నారు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'ఈటీవీ విన్' ఓటీటీ ట్రాక్ పైకి వచ్చింది. ఈ రోజు నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. 

యూజియన్ జాస్ చిరమ్మల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, క్రిస్టో జేవియర్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో షైన్ టామ్ చాకో  కనిపిస్తాడు. అతను పిల్లలకు ట్యూషన్స్ చెబుతూ వాళ్లకి దగ్గరవుతాడు. అలాగే తన పట్ల నిమీషకి గల చెడు అభిప్రాయాన్ని కూడా అతను మారుస్తాడు. ఆ తరువాత వివేక్ అనే కుర్రాడు కనిపించకుండా పోవడం, బెట్సి అనే అమ్మాయి చనిపోవడం జరుగుతుంది. అందుకు కారకులు ఎవరు? అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఓటీటీ వైపు నుంచి ఈ కంటెంట్ మంచి మార్కులు కొట్టేసే ఛాన్స్ అయితే ఉంది.

Shine Tom Chacko
Soothra Vaakyam
Malayalam movies
ETV Win
OTT release
Crime thriller
Malayalam cinema
Kristo Xavier
Nimisha
Eugine Jass Chiramal

More Telugu News