Janhvi Kapoor: ఈ సారి హిట్టు పట్టుకునే వెళతానంటున్న 'జాన్వీ కపూర్'

Janhvi Kapoor Special
  • ఆచితూచి టాలీవుడ్ కి వచ్చిన జాన్వీ 
  • 'దేవర' రిజల్ట్ తో డీలాపడిన బ్యూటీ 
  • 'పెద్ది'తో దక్కిన భారీ ఛాన్స్ 
  • షూటింగు దశలో ఉన్న సినిమా
  • వచ్చే మార్చిలో సినిమా రిలీజ్  
జాన్వీ కపూర్ బాలీవుడ్ లో అడుగుపెట్టి దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది. అక్కడ చెప్పుకోదగిన భారీ విజయాలు ఆమె ఖాతాలో పడలేదుగానీ, ఓ మాదిరి సక్సెస్ ల తోనే సరిపెట్టుకుంటోంది. అయితే టాలీవుడ్ కి మాత్రం ఒక భారీ హిట్ తోనే పరిచయం కావాలని ఆమె భావించింది. శ్రీదేవి కోరుకున్నది కూడా అదే. తల్లి ముచ్చట తీర్చడం కోసం జాన్వీ తీసుకున్న సమయం కూడా ఎక్కువే.

జాన్వీ తెలుగుకి సంబంధించి చాలా కథలు విన్న తరువాత, అన్నీ శుభ శకునాలు కనిపిస్తున్నాయని చెప్పి 'దేవర' కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో ఆమె చాలా డీలాపడిపోయేదే. అయితే లక్కీగా ఆ వెంటనే ఆమెకి 'పెద్ది'లో ఛాన్స్ వచ్చింది. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు దశలో ఉంది.

ఎన్టీఆర్ - చరణ్ .. 'ఆర్ ఆర్ ఆర్' చేస్తున్నప్పుడు, ఆ సినిమాతోనే జాన్వీ పరిచయమవుతుందనే వార్తలు వచ్చాయి. దాంతో ఎన్టీఆర్ జోడీ అయితే బాగుంటుందని ఆయన అభిమానులు, చరణ్ సరసన అయితే కరెక్టుగా ఉంటుందని ఆయన ఫ్యాన్స్ ఆశపడ్డారు. అయితే ఆ తరువాత ఆమె ఈ ఇద్దరి హీరోలతోనే మొదటి రెండు సినిమాలు ప్లాన్ చేయడం విశేషం. వచ్చే మార్చిలో విడుదల కానున్న 'పెద్ది' సినిమాతో హిట్టు పట్టుకెళ్లాలనే పట్టుదలతో జాన్వీ ఉన్నట్టుగా సమాచారం.  

Janhvi Kapoor
Janhvi Kapoor Telugu debut
Peddhi Movie
Devara Movie
NTR
Ram Charan
Buchibabu Sana
Koratala Siva
Bollywood
Tollywood

More Telugu News