Teenmar Mallanna: బీసీల కోసం కొత్త పార్టీ.. తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన

New BC Party Announced by Teenmar Mallanna in Telangana
  • కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు రెడ్డి, వెలమ పార్టీలని తీన్మార్ మల్లన్న విమర్శ
  • బీసీలకే ముఖ్యమంత్రి, మంత్రి పదవులు దక్కాలన్నదే తన లక్ష్యమని వెల్లడి
  • బీసీలను వేధించే అధికారులను వదిలిపెట్టబోనని హెచ్చరిక
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. బీసీలకు రాజకీయ అధికారమే లక్ష్యంగా త్వరలో ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కొన్ని సామాజిక వర్గాలకే పరిమితమయ్యాయని, బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కేవలం రెడ్డి, వెలమల పార్టీలుగానే మిగిలిపోయాయని ఆరోపించారు. బీసీల ఓట్లతో గెలిచి, పదవులు మాత్రం వారే అనుభవిస్తున్నారని విమర్శించారు. ఇకపై ఆ పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతోనే బీసీల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీ రాబోతోందని స్పష్టం చేశారు.

"బీసీల ఆత్మగౌరవ జెండా ఎగరవేయాల్సిన సమయం వచ్చింది. మన టికెట్లు మనమే ఇచ్చుకుని, మన పదవులు మనమే పంచుకుందాం" అని సభకు హాజరైన వారికి మల్లన్న పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి, మంత్రులు, మున్సిపల్ చైర్మన్ల వంటి కీలక పదవుల్లో బీసీలే ఉండాలన్నది తమ పార్టీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

మంచిర్యాలలో బీసీ బిడ్డలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్న అధికారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. "బీసీలపై ఈగ వాలినా రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తా. అలాంటి అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించను" అని ఆయన హెచ్చరించారు.
Teenmar Mallanna
Teenmar Mallanna new party
Telangana politics
BC politics
BC political party
Telangana BCs
BC welfare
Manchiryala
Telangana political parties
political news

More Telugu News