Revanth Reddy: తనకు మద్యం అలవాటు ఎందుకు లేదో చెప్పిన రేవంత్ రెడ్డి

Revanth Reddy Explains Why He Doesnt Drink Alcohol
  • మద్యపానం అలవాటుపై స్పందించిన సీఎం  
  • తన పెంపకమే దానికి కారణమని వెల్లడి
  • సమాజంలో ఆదర్శంగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నానన్న ముఖ్యమంత్రి
తాను ఎందుకు జీవితంలో మద్యం ముట్టలేదో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. తన పెంపకం, సామాజిక బాధ్యతలే ఇందుకు కారణమని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది.

వివరాల్లోకి వెళితే, తనకు చిన్నప్పటి నుంచి మద్యం సేవించాలనే కోరిక ఏనాడూ కలగలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. "చిన్నప్పటి నుంచి నేను పెరిగిన విధానం నన్ను మద్యానికి దూరం చేసింది. సమాజంలో బాధ్యత గల వ్యక్తిగా, నలుగురికీ ఆదర్శంగా ఉండాలని భావించినప్పుడు మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను. నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాను" అని ఆయన వివరించారు.

హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని ఒక 'ఐకాన్'‌గా అభివర్ణించారు. ముఖ్యమంత్రికి సిగరెట్, డ్రగ్స్, బీరు, విస్కీ వంటి ఎలాంటి దురలవాట్లు లేవని, ఆయనకు ఫుట్‌బాల్ అంటే మాత్రమే ఇష్టమని కొనియాడారు. 

ఈ నేపథ్యంలోనే, సీఎం చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి మద్యంకు దూరంగా ఉండటంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
Revanth Reddy
Telangana CM
Revanth Reddy alcohol
Konda Vishweshwar Reddy
Anti drugs day
Hyderabad
Telangana culture
Alcohol consumption

More Telugu News