సికింద్రాబాద్ నుంచి బయలుదేరే పలు రైళ్ల స్టేషన్ మార్పు... వివరాలివే

  • రైలు స్టేషన్ మార్పుపై దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
  • అక్టోబర్ 20 నుంచి 26 వరకు రైళ్లు బయలుదేరే స్టేషన్లు మార్పు
  • ఉందానగర్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్లకు మార్పు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నందున, ఈ స్టేషన్ నుంచి బయలుదేరే కొన్ని రైళ్లను ఇతర స్టేషన్లకు మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 20 నుంచి 26 వరకు రైళ్లు బయలుదేరే స్టేషన్ల వివరాలను అధికారులు వెల్లడించారు.

సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే పలు రైళ్లను ఉందానగర్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్లకు మార్చారు. వీటిలో ఎక్కువ రైళ్లు చర్లపల్లికి తరలించారు. సికింద్రాబాద్ - పోరుబందర్ రైలు ఉందానగర్ నుంచి, సిద్దిపేట - సికింద్రాబాద్ రైలు మల్కాజ్‌గిరి నుంచి, పుణే - సికింద్రాబాద్ రైలు హైదరాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతాయని అధికారులు పేర్కొన్నారు.

సికింద్రాబాద్ నుండి మణుగూరు, రేపల్లె, సిల్చార్, దర్భంగా, యశ్వంతాపూర్, అగర్తాలా, ముజఫర్ నగర్, సంత్రగచ్చి, దానాపూర్, రామేశ్వరం వెళ్లే రైళ్లను చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు మార్చారు.


More Telugu News