Revanth Reddy: రేపు ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy to Visit Delhi Tomorrow
  • జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
  • రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణం
  • ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు.

గురువారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనమవుతారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.

నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు చెందిన జాతీయ స్థాయి నేతలు, ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఇండియా కూటమి ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Revanth Reddy
Telangana CM
Delhi visit
India Coalition
Vice President candidate
Sudarshan Reddy

More Telugu News