Hari Hara Veera Mallu: ఓటీటీ ట్విస్ట్ .. హరి హర వీరమల్లు క్లైమాక్స్‌లో స్వల్ప మార్పులు!

Hari Hara Veera Mallu climax changes for OTT release
  • నెల తిరగకుండానే ఓటీటీలోకి పవన్ 'వీరమల్లు'
  • అమెజాన్ ప్రైమ్ లో సందడి చేస్తున్న హరి హర వీరమల్లు
  • ఓటీటీ వెర్షన్ లో దాదాపు 15 నిమిషాల పుటేజీ తొలగింపు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా గత నెల 24న థియేటర్లలో విడుదలైన విషయం విదితమే. అయితే, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో ఈ చిత్రం కొన్ని కీలక మార్పులతో ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

సినిమా థియేటర్లలో విడుదలైన సమయంలో వీఎఫ్ఎక్స్ నాణ్యతపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా గుర్రపు స్వారీ సన్నివేశం, పవన్ బాణం గురిపెట్టే సీన్స్ వంటి దృశ్యాలపై నెగటివ్ కామెంట్స్ రావడంతో, ఈ సన్నివేశాలను ఓటీటీ వెర్షన్‌లో తొలగించినట్లు సమాచారం. అదే విధంగా క్లైమాక్స్‌లో నటుడు బాబీదేవోల్‌కు సంబంధించిన కొన్ని డైలాగులు, యాక్షన్ సీన్‌లను కూడా కట్ చేసినట్టు నెటిజన్లు చెబుతున్నారు.

ఓటీటీ వెర్షన్‌లో దాదాపు 15 నిమిషాల ఫుటేజ్‌ను తొలగించి, కథా ప్రవాహాన్ని మెరుగుపరిచేలా చిత్రబృందం మార్పులు చేసింది. అలాగే, క్లైమాక్స్‌లో ‘అసుర హననం’ పాట తర్వాత 'Part 2' ప్రకటనతో సినిమాను ముగించారు.

ఈ చిత్రం ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. హరి హర వీరమల్లుని రెండు భాగాలుగా రూపొందించగా, ఇప్పటికే పార్ట్ 2 కు సంబంధించిన షూటింగ్ కొంత భాగం కూడా పూర్తయింది. పవన్ కల్యాణ్ అభిమానులు మాత్రం సినిమా ఓటీటీ విడుదలపై సంతోషం వ్యక్తం చేస్తుండగా, థియేటర్ వర్షన్‌లోని మార్పులపై చర్చ జరుగుతోంది. 
Hari Hara Veera Mallu
Pawan Kalyan
Krish Jagarlamudi
Bobby Deol
Amazon Prime Video
OTT release
Telugu movie
action drama
movie climax
part 2

More Telugu News