రేవంత్ రెడ్డిని కలిసిన సుకుమార్.. దర్శకుడి కూతురును సన్మానించిన సీఎం

  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దర్శకుడు సుకుమార్ భేటీ
  • కుటుంబ సమేతంగా సీఎం నివాసానికి వచ్చిన సుకుమార్
  • జాతీయ అవార్డు గెలిచిన కుమార్తె సుకృతికి సన్మానం
  • 'గాంధీ తాత చెట్టు' చిత్రానికి దక్కిన ఉత్తమ బాలనటి పురస్కారం
ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ కుటుంబ సమేతంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జాతీయ ఉత్తమ బాలనటిగా అవార్డు గెలుచుకున్న సుకుమార్ కుమార్తె సుకృతిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించి, సన్మానించారు.

‘గాంధీ తాత చెట్టు’ చిత్రంలో ప్రదర్శించిన అద్భుత నటనకు గాను సుకృతి జాతీయ పురస్కారం అందుకుంది. ఈ నేపథ్యంలో సుకుమార్ తన భార్య, కుమార్తెతో పాటు ప్రముఖ నిర్మాత యలమంచిలి రవిశంకర్‌తో కలిసి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు.

చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సుకృతి ప్రతిభను ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఆమెను శాలువాతో సత్కరించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


More Telugu News