ఓటీటీలోకి 'హరిహర వీరమల్లు'... రేపటి నుంచే స్ట్రీమింగ్
- నెల తిరగకుండానే ఓటీటీలోకి పవన్ ‘వీరమల్లు’!
- అమెజాన్ ప్రైమ్‌లో ‘హరి హర వీరమల్లు’ సందడి
- ఆగస్టు 20 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్
- థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే డిజిటల్ ఎంట్రీ
- తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులోకి
- పవన్ కల్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన భారీ చారిత్రక చిత్రం ‘హరి హర వీరమల్లు’ డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలైన నెల రోజులు కూడా గడవకముందే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 20 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది.
జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించారు. పాన్-ఇండియా స్థాయిలో జులై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. దీంతో థియేటర్లలో చూడలేకపోయిన అభిమానులు, సినీ ప్రియులు సినిమాను ఇంట్లోనే వీక్షించేందుకు అవకాశం లభించింది.
16వ శతాబ్దం నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే వీరమల్లు అనే బందిపోటు కథే ఈ చిత్రం. కోహినూర్ వజ్రాన్ని దక్కించుకునే క్రమంలో వీరమల్లు చేసే సాహసాలు ఈ చిత్రంలో ఆసక్తికరంగా ఉంటాయి.
ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటించగా, ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ దేఓల్ కనిపించారు. నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రీ, సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రంలో మొదటి భాగం ‘స్వోర్డ్ అండ్ స్పిరిట్’ పేరుతో విడుదల కాగా, రెండో భాగం షూటింగ్ దశలో ఉన్నట్లు సమాచారం.
.