మా అత్త గారి తర్వాత ఆవిడే మా కుటుంబ పెద్ద: సీఎం చంద్రబాబు
- నందమూరి కుటుంబంలో విషాదం
- ఎన్టీఆర్ పెద్ద కోడలు పద్మజ కన్నుమూత
- పద్మజ భౌతికకాయానికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ అత్త గారి తర్వాత పద్మజే కుటుంబ పెద్దగా ఉండేవారని తెలిపారు. తన పెళ్లి సమయంలోనూ పద్మజ-జయకృష్ణ దంపతులు అన్ని విషయాలు పర్యవేక్షించారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. పద్మజ గారి మృతి ముఖ్యంగా జయకృష్ణ గారికి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు.
గతంలో తాను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జయకృష్ణ ఎగ్జిబిటర్ గా ఉండేవారని చంద్రబాబు వెల్లడించారు. ఎగ్జిబిటర్ గా ఆయన తనవద్దకు వస్తూపోతూ ఉండేవారని, ఆయన ద్వారానే తనకు ఎన్టీఆర్ కుటుంబంతో పరిచయం ఏర్పడిందని వివరించారు. ఇక, పద్మజ కూడా అందరితో కలిసిపోయేవారని, ఆమె మృతి ఎంతో వేదన కలిగిస్తోందని అన్నారు.

